ముంబై, ఫిబ్రవరి 14: హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ తన కంపెనీల్లో కొన్నింటిని స్వతంత్రంగా ఆడిట్ చేయించేందుకు అంతర్జాతీయ అకౌంటెన్సీ సంస్థ గ్రాంట్ థోర్నటన్ను నియమించుకుంది. తమ కంపెనీల్లో గోప్యత ఏదీ లేదని, సంబంధిత చట్టాలకు అనుగుణంగానే నడుస్తున్నాయంటూ ఆర్బీఐ, సెబీ తదితర రెగ్యులేటర్లకు సమర్పించేందుకు ప్రధానంగా ఈ ఆడిట్‌ను ఉద్దేశించామని అదానీ వర్గాలు తెలిపాయి.
ఆస్తులు అమ్మితే అప్పులు చెల్లించవచ్చు
అదానీ గ్రూప్‌లోని సౌర విద్యుత్ సంస్థ గ్రీన్ ఎనర్జీ కొన్ని చర్యల్ని తీసుకోగలిగితే తన మొత్తం రుణం రూ. 22,000 కోట్లను రెండేండ్లలో చెల్లించగలదని అమెరికాకు చెందిన మరో హెడ్జ్ ఫండ్ బెర్న్‌స్టీన్ రీసెర్చ్ తెలిపింది. అదానీ గ్రీన్ కొన్ని తన రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్లను విక్రయించడం, ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి తాజా ఈక్విటీ మూలధనాన్ని సమీకరించడం లేదా కొన్ని ప్రతిపాదిత ప్రాజెక్టుల్ని రద్దు చేసుకోవడం, కొత్త ప్లాంట్లను కొనకపోవడం వంటి చర్యలతో రుణాల్ని 2025 మార్చికల్లా తీర్చుకోగలుగుతుందన్నది.
అదానీ షేర్ల పతనం
అదానీ షేర్ల పతనం కొనసాగుతున్నది. మంగళవారం స్టాక్ మార్కెట్లో లిైస్టెన 10 సంస్థల్లో ఏడు కంపెనీల షేర్లు 5 శాతం వరకు పతనం చెందాయి.