న్యూఢిల్లీ, జూన్ 17: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ మరో సీఎన్జీ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రాండ్ విటారా ఎస్-సీఎన్జీ వెర్షన్‌ను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.13.48 లక్షలుగా నిర్ణయించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ కారు డెల్టా సీఎన్జీ మాడల్ ధర రూ.13.48 లక్షలు కాగా, జెటా సీఎన్జీ రకం రూ.15.62 లక్షలు. కిలో సీఎన్జీకి ఈ మాడల్ 26.6 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నది.