Vishakha Steel | విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేనట్లేనా.. కేంద్రం మనస్సు మార్చుకుందా..?!
Vishakha Steel | మూడేండ్ల క్రితం 100 శాతం విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తామన్న కేంద్రం మనస్సు మార్చుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సెయిల్’లో విలీనానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Vishakha Steel | ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కు అంటూ సాగిన ఉద్యమం ఫలితంగా విశాఖపట్నంలో ఏర్పాటైంది విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ – ఆర్ఐఎన్ఎల్). 2019లో రెండోసారి కొలువు దీరిన తర్వాత విశాఖ స్టీల్ ప్రైవేటీకరిస్తామని కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్ పౌరుల భావోద్వేగాలతో ముడి పడి ఉన్న అంశం కావడంతో కేంద్రం వెనుకడుగు వేసినట్లు తెలుస్తున్నది. ప్రైవేటీకరించడానికి బదులు మరో కేంద్ర ప్రభుత్వ రంగ స్టీల్ సంస్థ ‘సెయిల్’లో విశాఖ స్టీల్ విలీనం చేయడానికి గల అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నది. అందుకోసం ఫైనాన్సియల్, ఆపరేషనల్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నది.
ఇందులో భాగంగా ఆర్ఐఎన్ఎల్ కార్యకలాపాల నిర్వహణకు కేంద్రం నిధులు సమకూరుస్తుంది. బ్యాంకు రుణాల పరిష్కారంతోపాటు విశాఖ స్టీల్ ఆధీనంలో ఉన్న భూమిని ఎన్ఎండీసీకి విక్రయించే యోచనలో కేంద్రం ఉందని తెలుస్తున్నది. ఈ విషయమై ఇటీవలే డీఎఫ్ఎస్ కార్యదర్శి, స్టీల్ కార్యదర్శి, ఎస్బీఐ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఆర్ఐఎన్ఎల్కు గణనీయ స్థాయిలో రుణాలిచ్చిన బ్యాంకుల్లో ఎస్బీఐ ఒకటి. విశాఖ స్టీల్‌కు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం అడుగులేస్తున్నదని అధికార వర్గాలు తెలిపాయి. అందులో సెయిల్‌లో ఆర్ఐఎన్ఎల్ విలీనం ఒక ఆప్షన్ అని ఆ వర్గాల కథనం.
ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో స్టీల్ శాఖ ఆధీనంలో పని చేయడంతోపాటు 75 లక్షల టన్నుల స్టీల్ ఆపరేటింగ్ సామర్థ్యం గల ప్లాంట్ ‘రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్). దేశంలోనే సముద్ర తీరాన్నే కొలువుదీరిన తొలి సమగ్ర స్టీల్ ప్లాంట్ ఇది. స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కూడా స్టీల్ శాఖ ఆధీనంలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్’కు అవసరమైన నిధులు సమకూర్చేందుకు రుణ దాతలతో సంప్రదించడంతోపాటు సంస్థకు గల 1500-2000 ఎకరాల భూమిని ఎన్ఎండీసీకి పెల్లెట్ ప్లాంట్ కోసం విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవడం మరొక ఆప్షన్. క్యాప్టివ్ ఐరన్ ఓర్ గనులను కేటాయిస్తే విశాఖ స్టీల్’కు అప్పుల బాధ తప్పుతుందని విశాఖ స్టీల్ కార్మికుల సంఘం నాయకుడు జే అయోధ్య రామ్ చెప్పారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అధిక ధరకు ఐరన్ ఓర్ కొనుగోలు చేస్తున్నారన్నారు.
2021 జనవరిలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సూత్రప్రాయంగా ‘విశాఖ స్టీల్’ను 100 శాతం ప్రైవేటీకరించేందుకు ఆమోదం తెలిపింది. విశాఖ స్టీల్ అనుబంధ సంస్థల్లో ఆ సంస్థ వాటాలను వ్యూహాత్మకంగా తగ్గిస్తూ ప్రైవేటీకరించాలని ప్రతిపాదించినట్లు తెలుస్తున్నది. బ్యాంకుల వద్ద విశాఖ స్టీల్ తీసుకున్న రూ.35 వేల కోట్ల రుణాలు దాదాపు మొండి బకాయిలుగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

