6 Airbags in Cars | కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి.. కేంద్రం ఏమన్నదంటే?!
6 Airbags in Cars | కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదిత ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదించారు.

6 Airbags in Cars | కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులు ఏర్పాటు చేయడానికి రూపొందించిన ముసాయిదా నోటిఫికేషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (ఎంఓఆర్టీహెచ్) ఆమోద ముద్ర వేసింది. 2019 జూలై ఒకటో తేదీ నుంచి డ్రైవర్ సీటుకు ఎయిర్‌బ్యాగ్.. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఫ్రంట్‌లో కో-ప్యాసింజర్ సీటుకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి చేస్తూ ఎంఓఆర్టీహెచ్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఎనిమిది మంది ప్యాసింజర్లతో ప్రయాణించే మోటారు వెహికల్స్‌లో వారి భద్రతా ఆదేశాలను విస్తరించాం.. ప్రతి కారులోనూ ఎనిమిది మంది ప్రయాణికులతో నడిచే వాహనాల్లో కనీసం ఆరు ఎయిర్ బ్యాగ్‌లను అమర్చాలన్న ప్రతిపాదనను తప్పనిసరి చేస్తున్నాం అని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ట్వీట్ చేశారు.
ఎప్పుడైనా రోడ్డు ప్రమాదాల్లో వాహనాల ముందు భాగాలను లేదా వెనుక భాగాలను ఢీ కొట్టినప్పుడు ఆయా కంపార్ట్మెంట్లలో ప్రయాణిస్తున్న వారి భద్రత కోసం నాలుగు అదనపు ఎయిర్ బ్యాగ్‌లు అమర్చాలి. ప్రయాణికులందరినీ కవర్ చేస్తూ రెండు వైపులా టొర్సో ఎయిర్‌బ్యాగ్‌లు, టూ సైడ్ కర్టయిన్ లేదా ట్యూబ్ ఎయిర్ బ్యాగ్‌లను అమర్చాల్సి ఉంటుంది. ఎల్లవేళలా భారత్‌లో మోటారు వెహికల్స్ సేఫ్టీకి ఇది కీలక చర్య కానున్నది. ఈ చర్యతో అన్ని రకాల సెగ్మెంట్ కార్లు, వాహనాల్లో ప్రయాణించే వారికి సేఫ్టీ లభిస్తుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

