శనివారం 27 ఫిబ్రవరి 2021
Business - Feb 01, 2021 , 11:54:54

బీమా రంగంలో ఎఫ్‌డీఐ ప‌రిమితి పెంపు

బీమా రంగంలో ఎఫ్‌డీఐ ప‌రిమితి పెంపు

న్యూఢిల్లీ: ‌కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్.. ఆర్థిక రంగ సేవ‌ల్లో కీల‌క‌మైన బీమా రంగ ప్ర‌యివేటీక‌ర‌ణ దిశ‌గా మ‌రో అడుగు ముందుకేశారు. బీమా సంస్థ‌ల్లో విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు (ఎఫ్‌డీఐ) ప‌రిమితిని మ‌రింత పెంచేందుకు బీమా చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు బీమా రంగంలో నేరుగా 49 శాతం వ‌ర‌కు మాత్ర‌మే ఎఫ్‌డీఐల‌ను అనుమ‌తించే వారు. ఆర్థిక రంగ పున‌రుత్తేజం కోసం ఈ ప‌రిమితిని 74 శాతానికి పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 

VIDEOS

logo