Cert-In Alert | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (Cert-In Alert) ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లోని లోపాలతో ఫోన్ హ్యాకింగ్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. ఆయా లోపాలను ఆసరా చేసుకొని హ్యాకర్స్ సులభంగా ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకొని వ్యక్తిగత డేటాను ఆసరా చేసుకొని హ్యాకర్స్ చాలా సులభంగా ఫోన్‌ను కంట్రోల్లోకి తీసుకోవచ్చని.. డేటాను తస్కరించే అవకాశం ఉందని చెప్పింది. ఫ్రేమ్‌వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్లు, కెర్నల్, కెర్నల్ ఎల్టీఎస్, మీడియాటెక్ కాంపోనెంట్లు, ఆర్మ్ కాంపోనెంట్లు, క్వాల్కామ్ కాంపోనెంట్లతో సహా Android సిస్టమ్‌లోని వివిధ భాగాలలో లోపాలు ఉన్నాయని పేర్కొంది.
దీన్ని అడ్డుకునేందుకు ఇండియన్ స్మార్ట్ ఆండ్రాయిడ్ యూజర్స్‌కి అప్డేట్ని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వెంటనే మొబైల్‌ని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. దేశంలో చాలావరకు స్మార్ట్ మొబైల్స్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే పని చేస్తున్నాయని సీఈఆర్టీ– ఇన్ చెప్పింది. ఇప్పటికీ పాత వెర్షన్లోనే ఉన్న స్మార్ట్ ఫోన్స్‌లోకి హ్యాకర్స్ సులభంగా ప్రవేశించి.. యూజర్‌కి తెలియకుండానే అందులోని విలువైన సమాచారాన్ని తస్కరిస్తారని పేర్కొంది. ఫొటోలు, యూపీఐ వివరాలు, ఇతరత్రా సమాచారం దొంగిలించవచ్చని చెప్పింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని పలు లోపాలను తాజాగా గుర్తించినట్లు తెలిపింది.
ఇవి ఆండ్రాయిడ్ యూజర్ల ప్రైవసీకి ముప్పుగా పరిణమిస్తాయని.. హానికరమైన సాఫ్ట్‌వేర్‌ని ఫోన్లో ఇన్స్టాల్ చేసే అవకాశం లేకపోలేదని హెచ్చరించింది. ఆండ్రాయిడ్ 12, ఆండ్రాయిడ్ 12ఎల్, ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14.. వెర్షన్లు వాడుతున్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని.. కొత్త వెర్షన్‌తో అప్డేట్ చేసుకోవాలని సూచించింది. సైబర్ మోసాల ప్రమాదాన్ని తగ్గించడానికి, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు వెంటనే తమ పరికరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అలాగే డెస్క్‌టాప్ వినియోగదారుల కోసం ఆపిల్ ఐట్యూన్స్, గూగుల్ క్రోమ్‌పై సైతం హెచ్చరికలు చేసింది. లోపాలున్న వాటిలో విండోస్ 12.13.3కి ముందు ఆపిల్ ఐట్యూస్ వెర్షన్, క్రోమ్ డెస్క్‌టాప్‌లో 124.0.6367.201/.202 వెర్షన్లు, లీనక్స్‌లో 124.0.6367.201 ముందు వెర్షన్లు ఉన్నాయని.. వాటిని అప్డేట్ చేసుకోవాలని సూచించింది.