Edible Oils | వంట నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితులు విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రజలకు వంట నూనెలు అందుబాటులోకి తేవడంతోపాటు వాటి ధరలను నియంత్రించడానికి ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు అమలులో ఉంటాయి.
అయితే, స్టాక్స్ పరిమితులను నిర్దేశించడంతోపాటు అక్రమ నిల్వల సమస్య నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. గతేడాదిలో వంట నూనెల ధరలు 46.15 శాతం పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతోపాటు దేశీయంగా సరఫరాలో సమస్యల వల్ల నూనెల ధరలు పెరిగాయి.
ఈ పరిస్థితుల్లో కస్టమర్లకు రిలీఫ్ కల్పించేందుకు కేంద్రం వంటనూనెల దిగుమతిపై సుంకం తగ్గించింది. కొందరు వ్యాపారులు అక్రమ నిల్వలతో కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రయత్నించడంతో నూనెలు, నూనె గింజల నిల్వలపై పరిమితులు విధించింది.