న్యూఢిల్లీ, మే 23: ఎక్సేంజ్ రేట్లలో ప్రభుత్వం జోక్యం చేసుకోలేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంచేశారు. రూపాయి పతనాన్ని అడ్డుకట్ట వేయడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలపై ఆయన పై విధంగా స్పందించారు. అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ పరిణామాల ఆధారంగా కరెన్సీలు ట్రేడింగ్ అవుతాయి తప్పా..దీంట్లో జోక్యం చేసుకునేది లేదని చెప్పారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్రం అన్ని విధాలుగా కృషి చేస్తున్నదని, ఇదే సమయంలో దిగుమతులను నియంత్రించడానికి కూడా చర్యలు తీసుకుంటుందన్న ఆయ న.. దేశీయ పెట్టుబడులను ప్రోత్సహించడం తమ లక్ష్యమన్నారు.