Google Pay | గూగుల్ అనుబంధ గూగుల్‌పే.. త్వరలో తన యూజర్లకు సౌండ్పాడ్ లను తేనున్నది. క్యూఆర్ కోడ్ స్కాన్‌తో యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్ ఈ-స్మార్ట్ స్పీకర్ ద్వారా వినిపిస్తాయి. ఈ ఏడాదిలోనే వైర్లెస్ స్పీకర్లను తేనున్నట్లు గురువారం సంస్థ తన బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది. ఇప్పటి వరకు దుకాణాల్లో దర్శనమిచ్చిన ఫోన్‌పే, పేటీఎంతోపాటు గూగుల్‌పే స్మార్ట్ స్పీకర్లు కూడా అందుబాటులోకి వస్తాయి.
గతేడాది ప్రయోగాత్మకంగా సౌండ్ పాడ్లను గూగుల్‌పే పరీక్షించినప్పుడు వ్యాపారుల నుంచి సానుకూల అభిప్రాయం వచ్చింది. దీంతో దేశమంతా విస్తరించాలని నిర్ణయానికి వచ్చింది. ఒక ఎల్సీడీ స్క్రీన్, సింగిల్ స్పీకర్‌తో వస్తున్న గూగుల్‌పే సౌండ్ పాడ్.. 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌గా ఉంటుంది. బ్యాటరీ, చార్జింగ్, కనెక్టివిటీ స్టేటస్ తెలిపే మూడు ఎల్ఈడీ ఇండికేటర్లు, మెనూ, వాల్యూమ్, పవర్ బటన్ ఉంటాయి.