న్యూఢిల్లీ : కన్వీనియన్స్ ఫీ పేరుతో గూగుల్ పే వినియోగదారులపై భారం మోపింది. తమ యాప్ యూపీఐ సర్వీస్ ద్వారా మొబైల్ ఫోన్ల రీచార్జ్ చేసుకునే యూజర్లపై రూ. 3 చొప్పున గూగుల్ పే (Google Pay) నూతన చార్జి విధిస్తోంది. గతంలో ఈ తరహా లావాదేవీలపై ఎలాంటి ఫీజును గూగుల్ పే వసూలు చేయలేదు. ఇక తాజా వడ్డింపుతో యూజర్లు గూగుల్ పే ద్వారా ప్రీపెయిడ్ ప్లాన్లను కొనుగోలు చేస్తే ఈ ఫీజు వర్తిస్తుంది.
ఈ తరహా లావాదేవీలకు పేటీఎం, ఫోన్‌పే ఇప్పటికే చార్జీలు వసూలు చేస్తుండగా గూగుల్ పే సైతం వాటి సరసన చేరింది. తన పేమెంట్ యాప్‌పై కన్వీనియన్స్ ఫీజును వసూలు చేస్తున్నా గూగుల్ ఇప్పటివరకూ అధికారికంగా ఫీజు వసూలుపై నోరు మెదపలేదు. జియో నుంచి రూ. 749 ప్రీపెయిడ్ రీచార్జ్‌పై రూ. 3 కన్వీనియన్స్ ఫీ వసూలుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఓ కస్టమర్ షేర్ చేయడంతో యూజర్లకు ఈ అప్డేట్ విషయం తెలిసింది.
ఈ ఫీజు యూపీఐ, కార్డు లావాదేవీలకు వర్తిస్తుంది. రూ. 100లోపు రీచార్జ్ ప్లాన్లపై కన్వీనియన్స్ ఫీ వర్తించదని, రూ 100పైబడిన రీచార్జ్ ప్లాన్లపైనే ఈ ఫీజు వర్తిస్తుందని టెక్ నిపుణులు ముకుల్ శర్మ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
Read More :
AI | ఉద్యోగులకు గుడ్ న్యూస్ : ఏఐతో వారానికి నాలుగు రోజుల పని