AI | ఉద్యోగులకు గుడ్ న్యూస్ : ఏఐతో వారానికి నాలుగు రోజుల పని
చాట్‌జీపీటీ వంటి ఏఐ (AI) టూల్స్ రాకతో టెక్ ప్రపంచంలో పని పద్ధతులు సమూలంగా మారనున్నాయి. ఏఐ రాకతో వారానికి నాలుగు రోజుల పని విధానం అందుబాటులోకి రానుంది.
న్యూయార్క్ : చాట్‌జీపీటీ వంటి ఏఐ (AI) టూల్స్ రాకతో టెక్ ప్రపంచంలో పని పద్ధతులు సమూలంగా మారనున్నాయి. ఏఐ రాకతో వారానికి నాలుగు రోజుల పని విధానం అందుబాటులోకి రానుంది. 2033 నాటికి బ్రిటన్, అమెరికాలోని మూడో వంతు ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పనిచేస్తారని తాజా అధ్యయనం వెల్లడించింది. వారానికి నాలుగు పనిదినాలతో ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ మెరుగుకానుంది.
ఉద్యోగులకు తగినంత శారీరక, మానసిక విశ్రాంతి లభించడంతో పాటు ఈ విధానంతో ఉత్పాదకత కూడా పెరగనుంది. యూరప్‌లో తొలిసారిగా బెల్జియం ఎలాంటి వేతన కోతలు లేకుండా ఉద్యోగులకు వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏఐ రాకతో పలు దేశాల్లో వారానికి నాలుగు పని దినాల విధానం అమలవుతుందని అధ్యయనం స్పష్టం చేసింది.
వారానికి నాలుగు రోజుల పని పద్ధతితో ఉద్యోగుల ఆరోగ్యం మెరుగవడంతో పాటు పనిచేసే విధానం, జీవనశైలి సమూలంగా మారుతుందని అటానమీ చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది. జీపీటీ-4 (డే వీక్) పేరిట నిర్వహించిన ఈ అధ్యయనం ఉత్పాదకత, ఉపాధిపై ఏఐ ప్రభావం గురించి పరిశీలించింది. అమెరికా, బ్రిటన్‌లో పనిచేస్తున్న కోట్లాది ఉద్యోగుల ఉత్పాదకత, అవుట్‌పుట్ ఏమాత్రం తగ్గకుండా వారిని ఏఐ వారానికి నాలుగు పనిరోజుల వైపు మళ్లిస్తుందని పేర్కొంది.
Read More :
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

