హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ సొల్యుషన్లో విశేషమైన సహకారం అందించినందుకుగాను గూగుల్ నుంచి ప్రతిష్ఠాత్మక యాక్సిలరేటర్ అవార్డును అందుకున్నది టెక్టోరో కన్సల్టింగ్ సంస్థ.
లండన్లో జరిగిన ఆండ్రాయిడ్ ఎంటర్ప్రైజ్ గ్లోబల్ పార్ట్నర్ సమ్మిట్లో ఈ అవార్డును టెక్టోరో ఎండీ శ్రీధర్ దన్నపనేని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ దన్నపనేని మాట్లాడుతూ.. గ్రోత్ యాక్సిలరేటర్ అవార్డును అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ గుర్తింపు అంకితభావంతో కూడిన మా బృందానికి, వారి కృషి, పట్టుదలకు నిదర్శనమన్నారు.