Google Pixel7A | భారత్ మార్కెట్లోకి గూగుల్ పిక్సెల్ 7ఏ.. ధరెంతంటే?!
Google | గూగుల్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ ఫోల్డ్, టాబ్లెట్ తోపాటు 5జీ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 7ఏ ఆవిష్కరిచింది.
Google | సెర్చింజన్ ‘గూగుల్ (Google)’ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ ‘పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold)’, పిక్సెల్ టాబ్లెట్ (Pixel Tablet) గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది. కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఐ/ఓ – 2023 సదస్సులో వీటిని ఆవిష్కరించింది. గ్లోబల్ మార్కెట్‌తోపాటు భారత్ మార్కెట్లో తన 5జీ స్మార్ట్ ఫోన్ `పిక్సెల్ 7ఎ (Pixel 7A)’ విడుదల చేసింది. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, 5జీ స్మార్ట్ ఫోన్లలో ‘గూగుల్ టెన్సర్ జీ2 (Google Tensor G2)’ ప్రాసెసర్ వాడింది. గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ (foldable smartphone Pixel Fold) గ్లోబల్ మార్కెట్ లో 1799 డాలర్లు (దాదాపు రూ.1.47 లక్షలు), గూగుల్ పిక్సెల్ టాబ్లెట్ (Pixel Tablet) 499 డాలర్లు (సుమారు రూ.41 వేలు), గూగుల్ పిక్సెల్ 7ఏ (Pixel 7A) ఫోన్ భారత్‌లో రూ.39,999లకు లభిస్తాయి.
![]()
సింగిల్ వేరియంట్‌గా గూగుల్ పిక్సెల్ 7ఏ
గూగుల్ పిక్సెల్ 7ఏ (Pixel 7A) స్మార్ట్ ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సింగిల్ వేరియంట్‌గా మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ 6.1-అంగుళాల డిస్ ప్లే విత్ 1080×2400 రిజొల్యూషన్, వర్క్స్ @ రీఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ పవర్ బ్యాకప్ కోసం 4385 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ జత చేశారు. ఈ ఫోన్ ధర రూ.43,999. గురువారం నుంచి ఫ్లిప్ కార్ట్ లో బుక్ చేసుకోవచ్చు. లాంచ్ ఆఫర్ కింద హెచ్డీఎఫ్సీ కార్డులపై కొనుగోలు చేసిన వారికి ఇన్ స్టంట్ డిస్కౌంట్ రూ.4000 లభిస్తుంది. దీంతో ఫోన్ రూ.39,999లకు లభిస్తుంది.
ఫొటోగ్రఫీ కోసం రేర్ ప్యానెల్‌పై డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. అందులో 64-మెగా పిక్సెల్ ప్రైమరీ, 13-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా ఉంటాయి. చార్కోల్, సీ, స్నో కలర్స్‌లో ఫోన్ లభ్యం అవుతుంది. తాజా ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. సెక్యూరిటీ, ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఐదేండ్ల పాటు అప్ డేట్ ఇస్తుంది గూగుల్.
![]()
2 వేరియంట్లలో గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ స్మార్ట్ పోన్
గూగుల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ‘గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold)’ రెండు వేరియంట్లతో మార్కెట్లోకి వస్తున్నది. 12జీబీ రామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ, 12జీబీ రామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్నది. ఈ ఫోన్ బ్లాక్, వైట్ కలర్స్‌లో లభిస్తుంది. గ్లోబల్ మార్కెట్లో గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ (Pixel Fold) కోసం ప్రీబుకింగ్స్ ప్రారంభించింది. వచ్చే నెల నుంచి డెలివరీలు ప్రారంభించనున్నది. అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఈ స్మార్ట్ ఫోన్ తోపాటు పిక్సెల్ వాచ్ ఉచితంగా అందిస్తున్నది.
గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ (Pixel Fold) స్మార్ట్ ఫోన్ 7.6-అంగుళాల మెయిన్ డిస్ ప్లే, 6.2-అంగుళాల కవర్ డిస్ ప్లే విత్ 1840×2208 పిక్సెల్ రిజొల్యూషన్‌తో వస్తున్నది. ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 10 మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ లెన్స్, 10 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరాతో వస్తుంది. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫ్రంట్ లో 10మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ మీద పని చేస్తుంది. పవర్ బ్యాకప్ కోసం 4800 ఎంఎహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.

పలు ఏఐ టూల్స్‌తో పిక్సెల్ టాబ్లెట్
పిక్సెల్ టాబ్లెట్ (Pixel Tablet) 11-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ ప్లే విత్ 2560×1600 పిక్సెల్స్ రిజొల్యూషన్‌తో వస్తున్నది. రెండు వేరియంట్లలో పిక్సెల్ టాబ్లెట్ (Pixel Tablet) అందుబాటులో ఉంటుంది. 8జీబీ రామ్ విత్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్, 8జీబీ రామ్ విత్ 256జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ తో వస్తున్నది. ఈ టాబ్లెట్ నుంచి 12 గంటల పాటు వీడియో లైవ్ స్ట్రీమ్ చూడొచ్చు. ఫ్రంట్ లో 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంది. సెక్యూరిటీ కోసం పవర్ స్విచ్ వద్ద ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. పిక్సెల్ టాబ్లెట్ (Pixel Tablet) లో పలు ఏఐ టూల్స్ వినియోగించారు. ఈ టాబ్లెట్ మూడు రంగుల్లో లభిస్తుంది. టైపింగ్ కంటే మూడు రెట్లు వేగంగా వాయిస్ రికగ్నిషన్ ఫీచర్ కూడా జత చేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

