హ్యుందాయ్ అల్కజార్‌కు మంచి రెస్పాన్స్
హ్యుందాయ్ కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన 7 సీటర్ ఎస్యూవీ అల్కజార్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. నెల రోజుల వ్యవధిలోనే 11 వేలకు పైగా బుకింగ్స్ రావడంతో హ్యుందాయ్ కంపెనీ హర్షం వ్యక్తం చేస్తున్నది

హ్యుందాయ్ కంపెనీ ఇటీవల మార్కెట్లోకి తీసుకొచ్చిన 7 సీటర్ ఎస్యూవీ అల్కజార్‌కు మంచి రెస్పాన్స్ లభిస్తున్నది. నెల రోజుల వ్యవధిలోనే 11 వేలకు పైగా బుకింగ్స్ రావడంతో హ్యుందాయ్ కంపెనీ హర్షం వ్యక్తం చేస్తున్నది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లకు మంచి రెస్పాన్స్ వస్తున్నదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గత నెల 18 న ఆల్కజార్ మోడల్ కార్లను హ్యుందాయ్ కంపెనీ భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ నెల రోజుల వ్యవధిలోనే 5,600 యూనిట్లు అమ్ముడుపోయాయి. మార్కోట్లో విడుదల చేయడానికి ముందు కంపెనీ ప్రీ బుకింగ్‌లకు అనుమతించింది. దాంతో తాము అనుకున్నదాని కంటే మంచి రెస్పాన్స్ వినియోగదారుల నుంచి వస్తున్నదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
‘అల్కాజార్ వినియోగదారుల నుంచి అధిక స్పందనను పొందింది. మార్కెట్లోకి విడుదల చేసినప్పటి నుంచి నెలలోపు 11,000 బుకింగ్స్ సంపాదించింది. ప్రీమియం ప్యాకేజీల కోసం వినియోగదారుల అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది’ అని హ్యుందాయ్ మోటార్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు. 10 సెకండ్ల వ్యవధిలో 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోవడం ఈ కార్ ప్రత్యేకత. 3 మోడళ్లలో ఈ కార్ అందుబాటులో ఉన్నది. కార్ ఇంటీరియర్ ఆకట్టుకునేదిగా ఉండటంతో ఈ కార్‌ను సొంతం చేసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నట్లుగా నిపుణులు చెప్తున్నారు. అల్కాజార్ కార్ ఎక్స్-షోరూమ్ ధర రూ.16,30,300 నుంచి రూ.19,99,000 లక్షలుగా ఉన్నది. భారతదేశంలో ఇది టయోటా ఇన్నోవా (రూ.16.53 లక్షల ఎక్స్-షోరూమ్ ధర), ఎంజీ హెక్టర్ ప్లస్ (రూ.13.63 లక్షల ఎక్స్-షోరూమ్ ధర), మహీంద్రా ఎక్స్‌యూవీ 500 (రూ.14.24 లక్షలు) తో పోటీ పడుతున్నది.
ఇవి కూడా చదవండి..
England Vs Pakistan | సిక్స్ కొడితే.. దద్దరిల్లిపోయింది..!
ఈ వ్యాయామం రోజూ చేస్తే రోగాల నుంచి దూరంగా ఉండొచ్చు.. ఏంటది?
అమెరికన్ నేవీలో మహిళా శకం ఆరంభం
ఈసారి సెంట్రల్ వర్సిటీల్లో నేరుగా ప్రవేశాలు
ఒక్క వన్డే.. 10 రికార్డులు.. అవేంటంటే..!
పాకిస్తాన్లో ఘోర రోడ్డు ప్రమాదం, 30 మంది మృతి
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ
సిద్ధివినాయకుడికి 2 కోట్లతో గుడి కట్టిన క్రిస్టియన్..! ఎందుకంటే..?
త్వరలో స్పేస్ మసాలా..! కావాలంటే వీరిని సంప్రదించాలి..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

