FD Interest Rise | దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం మొదలైనప్పటి నుంచి కీలక వడ్డీరేట్లు కనిష్ఠ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా సురక్షితంగా నిధులు మదుపు చేయాలనుకున్న వారికి శుభవార్త. ఆ దిశగా రెండు దిగ్గజ ప్రైవేట్ బ్యాంక్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు తమ ఖాతాదారుల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఫిక్స్డ్ డిపాజిటర్లకు మెరుగైన రిటర్న్స్ లభిస్తాయి. సాధారణ పౌరుల కంటే వృద్ధుల ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనంగా 0.50 శాతం వడ్డీని అందిస్తున్నాయి.
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ నెల ఒకటో తేదీ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఆ వివరాలేంటో చూద్దాం..
గడువు– — — — వడ్డీరేటు (%)
7- 29 రోజులు— 2.50
30 – 90 రోజులు- 3.00
6 నెలలు — — – 3.50
ఏడాది లోపు — 4.40
ఏడాది — — —- 4.90
రెండేండ్లు —– 5
మూడేండ్లు —- 5.15
ఐదేండ్లు — — 5.35
పదేండ్లు —- 5.50
మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు 2.5 నుంచి 5.50 శాతం వరకు పెంచాయి. గత నెల 16 నుంచి ఈ వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయి.
గడువు– — — — వడ్డీరేటు (%)
7- 29 రోజులు— 2.50
30 – 90 రోజులు- 3.00
184 రోజులు — – 3.50
ఏడాది లోపు — 4.40
389 రోజులు — 4.9
18 నెలలు —– 4.9
రెండేండ్లు — — 5
మూడేండ్లు —- 5.15
ఐదేండ్లు — — 5.35
పదేండ్లు —- 5.50
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో