FD Benefits | దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటి ఆర్బీఎల్ (మాజీ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్) సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం అద్భుతమైన ఫిక్స్డ్ డిపాజిట్స్ స్కీం తీసుకొచ్చింది. ఈ నెల 21న అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా ఆర్బీఎల్ బ్యాంక్.. ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌లో ఫిక్స్డ్ డిపాఇజట్లపై అదనంగా 0.75 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. కేవలం 15 నెలల టెన్యూర్ గల ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆర్బీఎల్ బ్యాంక్ 7.75 శాతం వడ్డీ అందిస్తున్నది. సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే 80 ఏండ్లు దాటిన వారు.
సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆర్బీఎల్ బ్యాంక్‌లో ఏడు శాతం వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. కానీ సూపర్ సీనియర్స్ సిటిజన్స్ డిపాజిట్ స్కీమ్‌లో మంత్లీ వడ్డీ చెల్లింపు ఆప్షన్ కూడా ఉంది.
సీనియర్ సిటిజన్లకు ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 3.75 నుంచి 7.50 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది ఆర్బీఎల్ బ్యాంక్. సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే 80 ఏండ్లు దాటిన వారికి అదనంగా 0.75 శాతం వడ్డీ అందిస్తున్నది. 60 నుంచి 80 ఏండ్ల మధ్య వయస్సు గల వారికి అదనంగా 50 బేసిక్ పాయింట్ల వడ్డీ ఆప్షన్ కల్పించింది.