Kris Srikkanth | వైభవ్ ఆట అద్భుతం.. అతడి కోసమే నా భార్య క్రికెట్ చూస్తోంది.. !
Kris Srikkanth : భార త యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) ఆటకు ఫిదా అవ్వని వారు అరుదు. తన భార్య కూడా వైభవ్ ఆటను తెగ ఇష్టపడుతోందని టీమిండియా దిగ్గజం క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) తెలిపాడు.
Kris Srikkanth : భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ(Vaibhav Sooryavanshi) ఆటకు ఫిదా అవ్వని వారు అరుదు. మాజీ ఆటగాళ్ల నుంచి.. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లు సైతం ఈ పదిహేనేళ్ల కుర్రాడి ప్రతిభకు అవాక్కవుతున్నారు. అందుకే.. అతడు మైదానంలో దిగగానే చిన్నాపెద్దా అనే తేడా లేకుండా స్టేడియాల్లో వాలిపోతున్నారు. ఇంట్లోనే టీవీలకు అతుక్కుపోతున్నారు చాలామంది. తన భార్య కూడా వైభవ్ ఆటను తెగ ఇష్టపడుతోందని టీమిండియా దిగ్గజం క్రిస్ శ్రీకాంత్ (Kris Srikkanth) తెలిపాడు.
ఐపీఎల్లో తుఫాన్ ఇన్నింగ్స్‌లతో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ కోసం అభిమానులు స్టేడియాలకు పోటెత్తుతున్నారు. నిండా పాతికేళ్లైనా లేని ఈ కుర్రాడి బ్యాటింగ్ మెరుపులు కళ్లారా చూసి మురిసిపోయేందుకు దేశవాళీ క్రికెట్‌ను సైతం చూసేస్తున్నారు. వైభవ్ రాకతో దులీప్ ట్రోఫీ(Duleep Trophy) మ్యాచ్ కూడా చూసే వాళ్ల సంఖ్య పెరిగింది. వీరిలో మాజీ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్ భార్య కూడా ఉంది. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు.
Even my wife is watching because of him – Kris Srikkanth’s massive praise for Vaibhav Suryavanshi’s Duleep Trophy 2026 heroics
Kris Srikkanth said:
“He’s playing outstandingly well. He must be encouraged and never be discouraged. If he’s molded properly, he’ll be a superstar in… pic.twitter.com/vPilzQBxDy
— Cricket Hub (@Anurag9793) September 4, 2026
యూట్యూబ్ షోలో మాట్లాడిన శ్రీకాంత్.. ‘మనందరం హాయిగా కూర్చొని దులీప్ ట్రోఫీ చూస్తున్నాం . ఇందుకు కారణం వైభవ్. మనలో చాలామందిమి అతడి ఆట కోసమే ఈ టోర్నీ చూస్తున్నాం. నా భార్య విద్య కూడా వైభవ్ బ్యాటింగ్ కోసమే దులీఫ్ ట్రోఫీ మ్యాచ్‌లు చూస్తోంది. ఐపీఎల్, టీ20.. తరహాలో ప్రేక్షకులు ఆ దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లపై ఆసక్తి చూపడానికి కారణం వైభవ్. అయితే.. అతడు 90ల్లో ఔటవుతున్నాడు. కానీ, అతడి హిట్టింగ్ అద్భుతం. సెమీఫైనల్లో సెంట్రల్ జోన్‌పై 81 బంతుల్లో 92 రన్స్‌తో చెలరేగాడు. అయినా సరే అతడు పెద్ద మ్యాచుల్లో ఆడగలడా? అనే సందేహం వెలిబుచ్చుతున్నారు.

కానీ, అతడు గొప్పగా ఆడుతున్నాడు. బౌలర్ల తలపై నుంచి అలవోకగా బంతిని స్టాండ్స్‌లోకి పంపేస్తున్నాడు. అతడిని మరింత ప్రోత్సహించాలి. వైభవ్‌ను ఇంకా సానబెడితే.. భవిష్యత్‌లో అతడు సూపర్ స్టార్ అవుతాడు’ అని పేర్కొన్నాడు. సునీల్ గవాస్కర్‌తో ఓపెనింగ్ చేసిన శ్రీకాంత్ 1993 అక్టోబర్ 8వ తేదీన అంతర్జాతీయ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆపై 2008 నుంచి 2012 వరకూ చీఫ్ సెలెక్టర్‌గానూ సేవలందించాడీ వెటరన్. అతడి హయాంలోనే ధోనీ సారథ్యంలోని టీమిండియా వన్డే ప్రపంచకప్‌ను గెలుపొందింది.
.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

