BRS Protest | కాంగ్రెస్ 1000 రోజుల విఫలపాలనపై రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ విఫల పాలనను ప్రజలకు తెలియజేయడంలో భాగంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలో బీఆర్ఎస్ ధర్నాకు వెళ్తుండగా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే పట్నం నరేందర్ రెడ్డిని తీసుకెళ్తున్న వాహనంలో సడెన్‌గా డీజిల్ అయిపోవడంతో అక్కడే నిలిచిపోయింది. దీంతో కాంగ్రెస్ సర్కార్ పాలనలో పోలీసుల పరిస్థితి ఎలా ఉందో చూడండి అంటూ బీఆర్ఎస్ శ్రేణులు తమదైన డైలాగ్స్ వర్షం కురిపించారు. సీఎం సొంత నియోజకవర్గంలో డీజిల్ లేదు.. రేవంత్ రెడ్డి వాహనంలో డీజిల్ అయిపోయింది.. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో పోలీసుల బండ్లకే దిక్కులేదు.. డొక్కు బండ్లు పట్టుకొస్తే రోడ్డు మొత్తం జామ్ అయింది.. ఓ గర్బిణీని అంబులెన్స్‌లో తీసుకువస్తుంటే ఈ పోలీసు వాహనం అడ్డుగా ఉండటంతో ఎమర్జెన్సీ వెహికల్ నిలిచిపోయిందని ఓ కార్యకర్త చెబుతుండటం వీడియోలో చూడొచ్చు.
బీఆర్ఎస్ కార్యకర్తలంతా కలిసి డీజిల్ లేక ఆగిపోయిన ఆ పోలీస్ వాహనాన్ని ముందు తోసి అంబులెన్స్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు.
చీచీ సిగ్గు సిగ్గు!
రేవంత్ రెడ్డి ప్రత్యర్ధిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పోలీస్ వాహనంలో డీజిల్ అయిపోయింది
రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో డీజిల్ లేక ఆగిపోయిన పోలీసు వాహనం
బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని… https://t.co/d4buhsWvkD pic.twitter.com/tKHE6ISJcz
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2026
January 12 Vidudala | వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీకి లీకుల బెడద.. సెట్ నుండి బయటకొచ్చిన సాంగ్ వీడియోలు!
KTR | కేటీఆర్‌కు అలుగునూరులో ఘనస్వాగతం.. పోటీపడి రాఖీలు కట్టిన మహిళలు
New World Map: కొత్త ప్రపంచ పటం .. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఇండియా ఓటు