EPFO | ఖాతాదారులకు ఈపీఎఫ్‌వో శుభవార్త చెప్పింది. అడ్వాన్స్డ్ క్లెయిమ్స్ కోసం ఆటో సెటిల్మెంట్ను రూ.లక్షలను రూ.5లక్షలు పెంచింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం వెల్లడించారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ఖాతాదారులకు వేగంగా ఆర్థిక సహాయం అందించడానికి ఈపీఎఫ్‌వో తొలిసారిగా ముందస్తు క్లెయిమ్స్ ఆటో-సెటిల్మెంట్ను ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. అత్యవసర సమయాల్లో క్లెయిమ్స్ చేసే ఈపీఎఫ్‌వో సభ్యులకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరో శుభవార్త చెప్పింది. క్లెయిమ్ మరింత సులభతరం చేసింది. గతంలో క్లెయిమ్స్ సమయాల్లో క్యాన్సల్డ్ చెక్, పాస్‌బుక్ ఫొటోలు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండేది. ప్రస్తుతం చెక్, పాస్‌బుక్ ఫొటోలు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదని కార్మికశాఖ ‘ఎక్స్’ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించింది.
క్లెయిమ్‌లను కొన్ని క్లిక్‌లలోనే సమర్పించవచ్చని.. వేగవంతమైన, ఇబ్బంది లేకుండా.. మీ సమయాన్ని ఆదా చేసేందుకు ఈ విధానం రూపొందించినట్లు కార్మిక శాఖ పేర్కొంది. సాధారణ క్లెయిమ్స్‌ను వేగంగా సెటిల్ చేసేందుకు ఆటో ప్రాసెసింగ్‌ను ఈపీఎఫ్ఓ తీసుకొచ్చింది. మానవ ప్రమేయం లేకుండానే క్లెయిమ్స్‌ను పరిష్కరించడమే ఈ ఆటో సెటిల్మెంట్ దీని ఉద్దేశం. వివాహం, ఉన్నత విద్య, గృహాల కొనుగోలు కోసం ఈపీఎఫ్ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. సాయంతో ఇకపై రూ.5లక్షల వరకు వేగంగా క్లెయిమ్ చేసుకునే వీలుంటుంది. ఆటో సెటిల్మెంట్ కారణంగా రూ.5 లక్ష వరకు ఎలాంటి క్లెయిమ్స్ వేగంగా పరిష్కారమవుతాయి. ఆటో సెటిల్మెంట్ ఐటీ వ్యవస్థ ఆధారంగా పని చేయనుండగా.. కేవైసీ, బ్యాంక్ వ్యాలిడేషన్ పూర్తయితే ఐటీ టూల్స్ పేమెంట్‌ను ఆటోమేటిక్‌గా ప్రాసెస్ ప్రక్రియ జరుపుతాయి. గతంలో సెటిల్మెంట్ పది రోజుల వరకు సమయం పట్టగా.. ప్రస్తుతం మూడు నాలుగు రోజుల్లోనే క్లెయిమ్స్ సెటిల్ అవుతాయి.