న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థికాభివృద్ధికి పెట్టుబడుల సమీకరణలో కీలకపాత్ర పోషించే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌ల్లోకెల్లా దిగ్గజ సంస్థ గోల్డ్‌మాన్ శాక్స్. యూఎస్‌లోని న్యూయార్క్ కేంద్రంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కార్యకలాపాలు, వివిధ ఫైనాన్షియల్ సర్వీసుల్ని నిర్వహిస్తున్న గోల్డ్‌మాన్ శాక్స్ హైదరాబాద్ లో సరికొత్త ఆఫీస్‌ను నెలకొల్పడానికి సిద్ధమైంది .
దీంతో ఉద్యోగులను 3 వేలకు పెంచుకోనున్నది. 154 సంవత్సరాల చరిత్ర కలిగిన గోల్డ్‌మాన్ శాక్స్ స్వయంగా ఈక్విటీ పెట్టుబడులు చేయడంతోపాటు కార్పొరేట్ల మధ్య ఒప్పందాలు, పబ్లిక్ ఆఫర్లను నిర్వహించడం, కంపెనీల నిధుల్ని సమీకరించడంలో గోల్డ్‌మాన్ శాక్స్ పేరొందింది.
ప్రధాన కార్యాలయం: న్యూయార్క్
వ్యవస్థాపక సంవత్సరం: 1869
మొత్తం ఆస్తుల విలువ: 1.44 ట్రిలియన్ డాలర్లు
నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ: 2.55 ట్రిలియన్ డాలర్లు
ఆదాయం: 47.37 బిలియన్ డాలర్లు (2022)
ఆపరేటింగ్ ఆదాయం: 13.48 బిలియన్ డాలర్లు
నికర లాభం 11.26 బిలియన్ డాలర్లుఉద్యోగుల సంఖ్య: 48,500 (2022)