Gold Rates | అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ బులియన్ మార్కెట్లోనూ బంగారానికి గిరాకీ అంతంత మాత్రంగానే ఉంది. ఫలితంగా గురువారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.700 తగ్గి రూ.77,050లకు చేరుకున్నది. బుధవారం కేవలం రూ.50 తగ్గి 77,750లకు చేరింది. వరుసగా నాలుగో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు కిలో వెండి ధర రూ.92,500 నుంచి రూ.2,310 తగ్గిపోయి రూ.90,190 వద్ద స్థిర పడింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం డిసెంబర్ డెలివరీ ధర రూ.804 పతనమై రూ.76,650 వద్ద ముగిసింది. మరోవైపు కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.2,067 క్షీణించి రూ.87,130 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ లో ఔన్స్ బంగారం ధర 29.10 డాలర్లు పతనమై రెండు నెలల దిగువన 2,557.40 డాలర్లు పలికింది. మరోవైపు ఔన్స్ వెండి ధర సైతం 2.57 శాతం పతనంతో 29.88 డాలర్లకు చేరుకున్నది.