Gold Rates | బంగారం ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రూ.400 పెరిగి రూ.98,020 చేరుకుంది. ఇక 22 క్యారెట్ల పసిడి రూ.300 పెరిగి రూ.97,800కి చేరుకుంది. అదే సమయంలో వెండి రూ.500 పెరిగి కిలోకు రూ.1.10లక్షలకు పెరిగిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. రూపాయి బలహీనంగా మారడం, యూఎస్ స్థూల ఆర్థిక డేటా విడుదల నేపథ్యంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయని.. ఈ డేటా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరకు మద్దతు ఇవ్వడంతో ఔన్సుకు 3,355 డాలర్లకు చేరుకుంది. టారిఫ్ ఆందోళనలు, రూపాయి విలువ తగ్గడంతో ర్యాలీకి కారణమని ఎల్కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది పేర్కొన్నారు.
రాబోయే వారంలో పెట్టుబడిదారులు రాబోయే ఆర్బీఐ RBI ద్రవ్య విధాన సమావేశం, యూఎస్ తయారీ డేటాపై దృష్టి సారిస్తారని పేర్కొన్నారు. సమీప భవిష్యత్తులో బులియన్ ధరల దిశపై మరింత మార్గదర్శనం చేస్తాయని పేర్కొన్నారు. మరో వైపు న్యూయార్క్లో బంగారం స్పాట్ ఔన్సుకు 3,363.83 వద్ద స్థిరంగా ఉన్నది. విదేశీ మార్కెట్లలో వెండి స్పాట్ ఔన్సుకు 37.20కి చేరుకుంది. మిరే అసెట్ షేర్ ఖాన్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ (ఫండమెంటల్ కరెన్సీస్అండ్ కమోడిటీస్) ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ.. గోల్డ్ స్పాట్ ఔన్సుకు 3,355 వద్ద ట్రేడవుతోందన్నారు. వడ్డీ రేటు కోతలను ఊహించి రిస్క్ ఆస్తులను వేలం వేస్తున్నారని.. సుంకాల ఆందోళనల కారణంగా భారత రూపాయిలో పతనం దేశీయ బంగారం ధరలకు మద్దతు ఇస్తోందని తెలిపారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల గోల్డ్ రూ.92,950 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.1,01,400 పలుకుతున్నది. ఇక వెండి కిలోకు రూ.1.23లక్షలు పలుకుతున్నది.