Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. మొన్న ధర భారీగా పతనం కాగా.. మంగళవారం మార్కెట్లో మళ్లీ స్వల్పంగా ధర పెరిగింది. తాజాగా బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో రూ.659 తగ్గి తులానికి రూ.96,850కి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ.700 తగ్గి రూ.96,400కి చేరుకుంది. ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్న నేపథ్యంలో ఉద్రిక్తతలు తగ్గుతున్నాయని.. ఫలితంగా బంగారం ధర తగ్గుతోందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
చైనా ఇటీవల అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో రెండు దేశాలు పరస్పరం వస్తువులపై 90 రోజుల పాటు సుంకాలను తగ్గించనున్నాయి. మరో వైపు వెండి ధరలు వరుసగా మూడోరోజు తగ్గాయి. బుధవారం వెండి ధరలు భారీగా రూ.1,450 తగ్గి కిలోకు రూ.98వేలకు చేరింది. ఇక హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.88,050 పలుకుతుండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.96,060 వద్ద ట్రేడవుతున్నది. ఇక కిలో వెండి ధర రూ.1,09,000 పలుకుతున్నది.