Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ వస్తూ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. రాబోయే రోజుల్లోనూ బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని ఐసీఐసీఐ బ్యాంక్ ఎకనామిక్ రీసెర్చ్ గ్రూప్ పరిశోధన పేర్కొంది. ఈ ఏడాది బంగారం తులానికి రూ.99,500 నుంచి రూ.1.10లక్షల మధ్య ట్రేడవుతుందని అంచనా. వచ్చే ఏడాది తొలి అర్ధభాగం వరకు ధర తులం ధర రూ.1.10లక్షల నుంచి రూ.1.25లక్షలకు పెరుగుతుందని పేర్కొంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ అంచనా వేసిన దానికంటే బలహీనపడితే.. అదనపు నష్టాలు వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ సమయంలో సగటు డాలర్ రూపాయి మారకం రేటు రూ.87 నుంచి రూ.89 మధ్య ఉంటుందని అంచనా. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధరలు దాదాపు 33శాతం పెరిగాయి.
యూఎస్ ఫెడర్ రిజర్వ్ ద్రవ్య విధాన పరిమితి సడలింపు, ఆర్థిక వ్యవస్థపై సంస్థాగత ఆందోళనలు బంగారం పెరుగుదలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఈ ఏడాదిలో మిగతా కాలంలో ప్రపంచ బులియన్ సగటున ఔన్స్‌కు 3400 నుంచి 3600 డాలర్ల వరకు ఉంటుందని అంచనా. 2026 తొలి అర్ధబాగంలో ఔన్స్‌కు 3,600 నుంచి 3,800 డాలర్ల దాకా వరకు పెరుగుతుందని విశ్లేషకుల అంచనా. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగితే.. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక బలహీనతలపై కొనసాగుతున్న ఆందోళన కారణంగా మధ్యస్త కాలంలో బంగారం ధరలు పెరుగుతూనే ఉంటాయని భావిస్తున్నారు. సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నా బంగారం కొనుగోలు స్వల్ప తగ్గుదల ఉన్నప్పటికీ.. గోల్డ్ పెరిగే అంచనాలు ఉన్నాయని అలాగే ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, వాణిజ్య యుద్ధం అనిశ్చితుల మధ్య బంగారం కొనుగోలు తగ్గిందని అంచనా. దేశీయంగా బంగారం ధరల పెరుగుదలకు రూపాయి బలహీనపడడం.. బలమైన పెట్టుబడి డిమాండ్ కారణాలు. భారతదేశ దిగుమతులు జూన్‌లో 1.8 బిలియన్ డాలర్ల నుంచి జులై 2025లో 4.0 బిలియన్ డాలర్లకు పెరిగాయి. పండుగల సీజన్‌కు ముందు బలమైన డిమాండ్‌ను ప్రతిబింబిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ డాది గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు రెట్టింపయ్యాయి. గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs)లో పెట్టుబడిదారుల ఆసక్తి స్పష్టంగా కనిపించిందని కూడా నివేదిక పేర్కొంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI) నుంచి డేటాను ఉదహరించింది. జూలైలో రూ.12.6 బిలియన్ల నికర పెట్టుబడి పెట్టినట్లు నివేదిక చూపించింది.