Gold rates | నిన్న ఆల్‌టైం హైయస్ట్కు చేరిన బంగారం ధరలు దిగొచ్చాయి. తులం బంగారంపై దాదాపు రూ.760 వరకు తగ్గింది. దీంతో శుక్రవారం హైదరాబాద్‌లో రూ.61,800 పలికిన 10 గ్రాముల బంగారం (24 క్యారెట్స్) ధర ఇవాళ రూ.61,040కి పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.700 తగ్గి రూ.55,950కి చేరుకుంది. శుక్రవారం రాత్రి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,013 డాలర్లకు పడిపోవడంతో భారత్‌లోనూ బంగారం ధరలు దిగొచ్చాయి.
శనివారం నాడు తులం బంగారం ధర అత్యధికంగా చెన్నైలో రూ.61,640గా న్యూఢిల్లీలో రూ.61,190గా ఉంది. ఇక బెంగళూరులో రూ.61,090 కాగా,, ముంబై, కోల్‌కతా, పుణె, నాగ్‌పూర్‌లో రూ.61,040గా కొనసాగుతోంది. వెండి ధరలు కేజీకి రూ.1500 వరకు తగ్గి రూ.81,500కు చేరింది.