Gold Rate | బంగారం అంటే భారతీయులకు.. మహిళలకు మరీ ఇష్టం.. కానీ, ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు పైపైకి పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు, డాలర్ విలువ, ద్రవ్యోల్బణం ప్రభావం బంగారంపై చూపుతున్నది. ఫలితంగా మంగళవారం బులియన్ మార్కెట్లో తులం (24 క్యారట్లు) బంగారం ధర రూ.61 వేల మార్క్ వద్ద నిలిచింది. హైదరాబాద్లో సోమవారం ధరతో పోలిస్తే రూ.220 పెరిగి రూ.60,930గా నిలిచింది. సోమవారం రూ.60,710 వద్ద ట్రేడయింది. తెలంగాణలోని ఇతర నగరాలు వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, అమరావతి, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, కడప, అనంతపురం నగరాల్లోనూ రూ.60,930 పలికింది.
ఇక చెన్నై, కోయంబత్తూర్, మదురై, వెల్లూర్, సేలం, తిరుపూర్, తిరునెల్వేలి నగరాల్లో రూ.61,420 పలికింది. ఇక దేశంలోని మెట్రో పాలిటన్ నగరాలు ముంబైలో రూ.60,930, ఢిల్లీలో రూ.61,080, బెంగళూరులో రూ.60,980, కోల్కతాలో రూ.60,930, అహ్మదాబాద్ లో రూ.60,980 వద్ద నిలిచింది. బంగారం కొనుగోలు దారులు ఈ ధరలపై అదనంగా జీఎస్టీ, సుంకాలు, ఇతర పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
దేశీయంగా కిలో వెండి ధర రూ.360 తగ్గి రూ.75,240 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ పుత్తడి ధర 1988.80 డాలర్లు వద్ద నిలిస్తే, ఔన్స్ వెండి ధర స్వల్పంగా తగ్గి 25.01 డాలర్ల వద్ద ట్రేడయింది. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ లో తులం బంగారం ధర మంగళవారం రూ.40 పెరిగి రూ.60,041 పలికింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో రూ.040 (0.07 శాతం) పెరిగి రూ.60,041 వద్ద నిలిచింది. అంతర్జాతీయంగానూ న్యూయార్క్ ఫ్యూచర్ మార్కెట్ లో ఔన్స్ బంగారం 2000 డాలర్ల వద్దకు దూసుకెళ్లింది.