న్యూఢిల్లీ, అక్టోబర్ 15 : బంగారం భగభగమండుతున్నది. వరుసగా మూడు రోజులుగా పెరుగుతున్న పుత్తడి ధర బుధవారం కూడా మరో రూ.1,000 ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,31,800కి చేరుకున్నది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పండుగ సీజన్ కావడంతో కొనుగోళ్లు ఊపందుకోవడంతో ధరలు పెరిగాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. కానీ, రికార్డు స్థాయికి చేరుకున్న వెండి ధరలు తగ్గుముఖంపట్టాయి. కిలో వెండి రూ.3,000 తగ్గి రూ.1.82 లక్షలకు పరిమితమయ్యాయి.