న్యూఢిల్లీ, డిసెంబర్ 11: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.900 దిగి రూ.61,300కి చేరుకున్నది. అంతకుముందు ధర రూ. 62,200గా ఉన్నది. స్వల్పంగా తగ్గిన కిలో వెండి రూ.76 వేలు వద్ద ఉన్నది.
ఇటు హైదరాబాద్ బులియన్ మార్కె ట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.220 దిగి రూ.62,350 నుంచి రూ.62,130కి దిగిరాగా, 22 క్యారెట్ల ధర రూ.200 తగ్గించి రూ.56,950కి దిగొచ్చింది. అటు కిలో వెండి కూడా రూ.200 తగ్గి రూ.77,800కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ధర 1,998 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, వెండి 22.98 డాలర్లుగా ఉన్నది. బంగారం ధరలు మూడు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి.