Gold | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. పదిగ్రాముల పుత్తడి ధర లక్ష రూపాయల మార్క్‌ను అధిగమించి సామాన్యుడికి అందని స్థాయికి చేరుకున్నది. దీంతో సామాన్యుడితోపాటు మహిళలు కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. అక్షయ తృతీయ, వివాహం సందర్భంగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు, కానీ ప్రస్తుతం ధర లక్ష స్థాయిలో ఉండటంతో మధ్యస్థాయి కుటుంభాలు వీటికి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే ఇతర ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై బంగారం పిడుగు పడ్డట్టు అయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశ రాజధానిలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,800 ఎగబాకి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,01,600కి చేరుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టినప్పటికీ లక్ష రూపాయల దారిదాపుల్లోనే కొనసాగుతున్నది. పండుగ సీజన్‌తోపాటు కుటుంబ ఫంక్షన్లలో మహిళలు బంగారం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు..ప్రస్తుతం దీని ధర రికార్డు స్థాయిలో పలకడంతో మహిళలు నిరుత్సాహానికి గురవుతున్నారు. గతేడాది డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు బంగారం ధరలు 29 శాతం లేదా రూ.22,650 పెరిగింది. ఈక్విటీ మార్కెట్లు, బాండ్ల కంటే పసిడి అత్యధిక రిటర్నులను పంచింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళ వద్ద 24 వేల టన్నుల బంగారం ఉన్నదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా అంచనాను విడుదల చేసింది.
నా కూతురు పెళ్లి వచ్చే నవంబర్‌లో ఉన్నది. అకస్మాత్తుగా బంగారం ధర లక్ష రూపాయలు అధిగమించింది..ఇప్పుడు పుత్తడిని కొనుగోలు చేయడమెట్లా అని ఆలోచిస్తున్నాను.
– రూప, గృహిణి
‘ నా భర్త ప్రతి ఏటా బంగారాన్ని కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం దీని ధర గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఈ ఆభరణాలు నాకు గౌరవాన్ని, ఆర్థిక బలాన్ని ఇచ్చాయి’