హైదరాబాద్, నవంబర్ 23: బంగారం ధరలు పడుతూ.. లేస్తూ సాగుతున్నాయి. గత పది రోజులుగా తీవ్ర ఒడిదుడుకుల నడుమ రేట్లు అక్కడక్కడే ఉంటుండగా, గురువారం హైదరాబాద్లో 24 క్యారెట్ తులం రూ.61,970గా ఉన్నది. 22 క్యారెట్ రూ.56,800 ఉండగా.. బుధవారంతో పోల్చితే రూ.50 చొప్పున పడిపోయాయి.
మరోవైపు ఢిల్లీలో 10 గ్రాములు మేలిమి బంగారం రూ.62,170 పలికింది. కాగా, కిలో వెండి హైదరాబాద్లో రూ.200 పెరిగి రూ.79,200గా ఉన్నది. ఢిల్లీలో రూ.76,400 వద్ద నిలిచింది. ఇక అంతర్జాతీయంగా ఔన్సు పసిడి 1,994 డాలర్లు, వెండి 23.66 డాలర్లుగా ఉన్నది.