Gold- Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.600 పతనమై రూ.77,700లకు పరిమితమైంది. మంగళవారం తులం బంగారం ధర రూ.78,300 వద్ద స్థిర పడింది. ఇదిలా ఉంటే కిలో వెండి ధర రూ. 2,800 క్షీణించి రూ.91,200లకు చేరుకున్నది.
బుధవారం తులం (99.5 శాతం స్వచ్ఛత) బంగారం ధర రూ.600 తగ్గి 75,190లకు చేరుకున్నది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం డిసెంబర్ డెలివరీ ధర రూ.29 తగ్గి, రూ.75,190 వద్ద నిలిచింది. కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.754 తగ్గి రూ.89,483 వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్‌లో ఔన్స్ బంగారం ధర 2634.50 డాలర్లు పలికింది. ఔన్స్ వెండి ధర రూ.20.83 డాలర్ల వద్ద నిలిచింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హిజ్బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం కోసం పిలుపునిచ్చింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గి ఉంటాయని భావిస్తున్నారు.