న్యూఢిల్లీ, మార్చి 5: బంగారం ధరలు కొండదిగుతున్నాయి. పశ్చిమాసియాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గతవారంలో రికార్డు స్థాయిలో దూసుకుపోయిన బంగారం అంతే వేగంతో తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం రూ.7,600 తగ్గి రూ.1.61 లక్షలకు దిగిరాగా, వెండి రూ.27,700 వేలు దిగొచ్చింది.
అటు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ. 1,630 తగ్గి రూ.1,62,880కి దిగొచ్చింది. అలాగే 22 క్యారెట్ ధర రూ.1,500 తగ్గి రూ.1,49,300కి దించింది. అలాగే కిలో వెండి రూ.2.95 లక్షలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 55 డాలర్లు తగ్గి 5,070 డాలర్లకు పరిమితంకాగా, వెండి 1.57 డాలర్లు తగ్గి 81 డాలర్లకు దిగొచ్చింది.