Gold Price | న్యూఢిల్లీ, డిసెంబర్ 19: బంగారం ధరలు శాంతించాయి. ఆభరణాల వర్తకులు, అంతర్జాతీయంగా డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొచ్చాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.800 దిగొచ్చి రూ.79 వేల దిగువకు రూ.78,300కి పడిపోయింది. అంతకుముందు ఇది రూ.79,100 గా ఉన్నది.
అమెరికా ఫెడ్ రిజర్వ్ కఠిన ద్రవ్య వైఖరే ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని ట్రేడర్ వెల్లడించారు. కిలో వెండి ఏకంగా రూ. 2,000 తగ్గి రూ.90 వేలుగా నమోదైంది. ఇటు హైదరాబాద్లో 24 క్యారెట్ తులం పుత్తడి ధర రూ.710 తగ్గి రూ.77,130కి దిగిరాగా, 22 క్యారెట్ ధర రూ.650 తగ్గి రూ.70,700కి తగ్గింది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,634 డాలర్లకు, వెండి 29.90 డాలర్లకు తగ్గాయి.