Gold Price Today | దిగి వస్తున్న బంగారం ధరలు.. అదే బాటలో వెండి
Gold price today | దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల డౌన్‌ఫాల్ నడుస్తుంది. శనివారం కూడా అదే ట్రెండ్ కొనసాగింది. ఇవాళ 100 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర

Gold Price Today | న్యూఢిల్లీ: దేశంలో గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల డౌన్‌ఫాల్ నడుస్తుంది. శనివారం కూడా అదే ట్రెండ్ కొనసాగింది. ఇవాళ 100 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర సుమారు రూ.4,000 తగ్గి రూ.4,53,900కు చేరింది. క్రితం ట్రేడ్‌లో 100 గ్రాముల బంగారం ధర రూ.4,57,800 వద్ద ముగిసింది. ఇవాళ దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.49,600 ఉండగా, 22 క్యారట్ బంగారం ధర రూ.45,550గా ఉన్నది.
ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,390 ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర రూ.45,390గా ఉన్నది. చెన్నైలో 24 క్యారట్ గోల్డ్ ధర రూ.47,690, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.43,710, కోల్‌కతాలో 24 క్యారట్ బంగారం ధర రూ.48,350, 22 క్యారట్ బంగారం ధర రూ.45,650, హైదరాబాద్, కేరళలో 24 క్యారట్ గోల్డ్ ధర రూ.47,350, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.43,400, అహ్మదాబాద్‌లో 24 క్యారట్ గోల్డ్ ధర రూ.48,200, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.44,680, లక్నోలో 24 క్యారట్ గోల్డ్ ధర రూ.49,690, 22 క్యారట్ గోల్డ్ ధర రూ.45,550గా ఉన్నాయి.
ఇక వెండి ధరలు కూడా బంగారం ధరల బాటలోనే కొనసాగుతున్నాయి. ఇవాళ కిలో వెండి ధర రూ.1,200 తగ్గి రూ.61,600కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.62,800 వద్ద ముగిసింది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,762 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 22.95 అమెరికన్ డాలర్లు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

