పుత్తడి ధరల్లో తేడాలెందుకో..
బంగారం ధరలు ఏ రోజుకారోజు పెరుగుతూ పోతున్నాయి. కేవలం వారం రోజుల్లోనే తులం ధర దాదాపు రూ.3,000 మేర ఎగిసింది. మరోవైపు పెండ్లిడ్ల సీజన్ నడుస్తున్నది.
బంగారం ధరలు ఏ రోజుకారోజు పెరుగుతూ పోతున్నాయి. కేవలం వారం రోజుల్లోనే తులం ధర దాదాపు రూ.3,000 మేర ఎగిసింది. మరోవైపు పెండ్లిడ్ల సీజన్ నడుస్తున్నది. ధర ఎంతైనా అవసరాలకు ఆభరణాలు కొనడం తప్పనిసరే. కొనడానికి వెళితే ఒకో దుకాణంలో ఒకో ధర చెపుతుంటారు. ఆయా జ్యువెలర్ వెబ్సైట్ల్లోనూ ధరల్లో తేడాలుంటాయి. అలాగే ప్రచార సాధనాల్లో చూస్తున్న బంగారం ధరకు షాప్‌లో లేదా వెబ్సైట్లో చూసే ధరకు వ్యత్యాసం కన్పిస్తుంది. దీంతో ఎక్కడ కొనాలి? కొన్న బంగారం స్వచ్ఛత ఎంత? ఏ రేటుకు కొనాలి? తదితర సందేహాలన్నీ ముసిరేస్తాయి. ఆ సందేహాలు తొలగిపోవాలంటే నగల ధరల్ని ఏయే అంశాలు నిర్దేశిస్తాయో తెలుసుకోవాలి. అవి..
బంగారం స్వచ్ఛత
బంగారు నగల్ని వివిధ రకాల పుత్తడితో తయారు చేస్తారు. బంగారం స్వచ్ఛతను క్యారెట్‌తో కొలుస్తారు. పూర్తి స్వచ్ఛతతో (24 క్యారెట్) కూడిన బంగారం సున్నితంగా ఉంటుంది. అందుచేత నగగా మలచడానికి మరో లోహాన్ని అందులో కలుపుతారు. దీనితో ఆభరణాల బంగారంలో స్వచ్ఛత కొంత తగ్గుతుంది. సాధారణంగా 22 క్యారెట్ బంగారాన్ని నగల తయారీలో ఉపయోగిస్తారు. 22 క్యారెట్ అంటే ఆ నగల్లో 91.6 శాతం బంగారం ఉంటుందన్న మాట. 18 క్యారెట్, 14 క్యారెట్ బంగారు నగలు సైతం లభిస్తాయి. 22 క్యారెట్ బంగారానికంటే వీటిలో ఉండే బంగారం స్వచ్ఛత మరింత తక్కువ ఉంటుంది.
హాల్ మార్కింగ్
మనం కొన్న ఆభరణాల్లో ఉన్న బంగారం స్వచ్ఛతను ధృవీకరించేదే హాల్ మార్కింగ్. ఈ ప్రక్రియను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నిర్వహించి, నగలో ఉన్న స్వచ్ఛతను సర్టిఫై చేస్తుంది. అరు అంకెలు కలిగిన అల్ఫాన్యూమరిక్ హెచ్‌యూఐడీ కోడ్ లేకుండా జువెల్లర్ బంగారం అమ్మడం నిషిద్ధం. ఈ నిబంధన 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది.
మూడు ప్రధాన అంశాలు
ఆభరణ వ్యాపారులు ముఖ్యంగా మూడు అంశాల ఆధారంగా బంగారు నగల ధరను నిర్ణయిస్తారు.అవి:
1. ఆభరణాల బంగారం..అంటే 22 క్యారెట్, 18 క్యారెట్, 14 క్యారెట్
2.ఆభరణంలో వాడే బంగారంతో కలిపే లోహం..అంటే వెండి, రాగి, టైటానియం, ఐరెన్, జింక్. సాధారణంగా రాగిని వాడుతారు.
3. ఆయా నగ తయారీకి అయ్యే వ్యయం. డిజైన్‌ను బట్టి వ్యయం లో మార్పులుంటాయి. ఎందుకంటే ప్రతీ నగకూ కటింగ్, పాలిషింగ్‌కు వేరువేరు విధానాల్ని అవలంబిస్తారు. అంతకంటే ముఖ్యంగా ఆ డిజైన్ యంత్రం ద్వారా రూపొందించబడిందా? లేక హస్తకళా నైపుణ్యంతో రూపుదిద్దుకుందా అనే అంశాల ఆధారంగా తయారీ చార్జీలు ఉంటాయి.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mrunal Takhur | ఇతరుల జీవితాలపై కామెంట్స్ చేయడానికి మీరెవరు.. మృణాల్ ఠాకూర్ సీరియస్
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

