అహ్మదాబాద్: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఆ రాజస్థానీ బ్యాటర్ తన షాట్స్‌తో కేక పుట్టించాడు. 776 రన్స్ చేసిన అతను ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. దీంతో పాటు సూపర్ స్ట్రయికర్ ఆఫ్ ద సీజన్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆప్ ద సీజన్, అత్యధిక సిక్సర్ల అవార్డులను వైభవ్ సొంతం చేసుకున్నాడు. అయితే అవార్డు ప్రజెంటేషన్ సమయంలో.. మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఆ యువ బ్యాటర్‌ను ఓ ప్రశ్న వేశాడు. ఆ ప్రశ్నకు చాలా లైట్‌గా నవ్వుకునే రీతిలో వైభవ్ సూర్యవంశీ జవాబు ఇచ్చాడు. బ్యాటింగ్ స్టయిల్ అద్భుతంగా ఉందని, చాలా తేలికగా భారీ షాట్లు కొట్టేస్తున్నావని సూర్యవంశీని రవిశాస్త్రి మెచ్చుకున్నాడు. నీకు ఇంత బలం ఎలా వస్తుందని, రోజుకు ఎన్ని పాలు తాగుతున్నావని శాస్త్రి ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విన్న సూర్యవంశీ నవ్వుకున్నాడు. నేనేమీ ఇప్పుడు పాలు తాగడం లేదు సార్ అని నవ్వుతూనే సూర్యవంశీ జవాబిచ్చాడు. ఆ ఇద్దరి మధ్య కాస్త ఫన్నీగా సంభాషణ సాగింది. ఆ వీడియో వైరల్ అవుతోంది.
Funny conversations between Ravi Shastri and Vaibhav Suryavanshi 😂✨ pic.twitter.com/FmY2TpPr5g
— Shin Kohli (@Shinkohli) May 31, 2026
వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ అందుకున్న యువ ప్లేయర్‌గా నిలిచాడు. 15 ఏళ్ల 65 రోజుల వయసులో సూర్యవంశీ ఆ అవార్డు అందుకుని రికార్డు సృష్టించాడు. గత ఏడాది గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఆ అవార్డు అందుకున్నాడు. 23 ఏళ్ల 231 రోజుల వయసులో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 2026 ఐపీఎల్ సీజన్లో సూర్యవంశీ 16 ఇన్సింగ్స్‌లు ఆడి 776 రన్స్ చేశాడతను. ఈ సీజన్లో సూర్యవంశీ మొత్తం 72 సిక్సర్లు కొట్టి ఐపీఎల్లో కొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.