దుబాయ్: అమెరికా మిలిటరీ(US Military) కీలక ప్రకటన చేసింది. ఇరానీ రేడార్, డ్రోన్ కంట్రోల్ కేంద్రాలపై దాడి చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. గత వారం అమెరికాకు చెందిన ఎంక్యూ-1 ప్రిడేటర్ డ్రోన్‌ను ఇరాన్ నేలకూల్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనకు ప్రతీకారంగా అమెరికా మిలిటరీ చర్యకు దిగినట్లు తెలుస్తోంది. ఆత్మరక్షణలో భాగంగా గోరుక్తో పాటు ఖేసమ్ దీవుల్లో ఉన్న ఇరానీ రేడార్, డ్రోన్ కంట్రోల్ కేంద్రంపై దాడి చేసినట్లు సెంట్కామ్ తన ప్రకటనలో తెలిపింది. శని, ఆది వారాల్లో ఆ దాడులు జరిగినట్లు సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. అంతర్జాతీయ జలాల్లో పనిచేస్తున్న ఎంక్యూ-1 డ్రోన్‌ను ఇరాన్ నేలకూల్చింది. అయితే ప్రమాదకరంగా ఉన్న ఇరానీ డ్రోన్లు, రేడార్లను పేల్చివేసినట్లు అమెరికా చెప్పింది. ఈ ఆపరేషన్‌లో సైనిక సిబ్బంది ఎవరికీ హానీ జరగలేదని అమెరికా పేర్కొన్నది. అమెరికా ఆస్తులు, ప్రయోజనాల రక్షణ కోసం దాడి చేస్తామని సెంట్కామ్ తెలిపింది.
— U.S. Central Command (@CENTCOM) June 1, 2026