పుత్తడి మరింత పైకి
గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పుంజుకోవడం, రూపాయి బలహీనంగా ఉండటంతో ధరలు పెరిగాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కె ట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,700 ఎగబాకి రూ.1,52,300కి చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడింది.
- రూ.1,700 పెరిగిన తులం ధర
న్యూఢిల్లీ, జూన్ 22: గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పుంజుకోవడం, రూపాయి బలహీనంగా ఉండటంతో ధరలు పెరిగాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కె ట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,700 ఎగబాకి రూ.1,52,300కి చేరుకున్నట్లు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడింది. అంతకుముందు ఇది రూ.1,50,600గా ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పెరిగాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.4,800 అందుకొని రూ.2,45, 500 పలికింది.
అంతక్రితం నాలుగు రోజుల్లో వెండి రూ.8 వేలు తగ్గి రూ.2,40,700కి పడిపోయిన విషయం తెలిసిందే. అమెరికా వడ్డీరేట్లు సుదీర్ఘకాలంపాటు అధికంగా ఉంటాయనే అంచనాలు, పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ పరిస్థితులు మెరుగుపడుతుండటంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్మెంట్లను సురక్షితమైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు అధికమయ్యాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 49.93 డాలర్లు లేదా 1.2 శాతం అధికమై 4,210.19 డాలర్లకు చేరుకోగా, వెండి 2.4 శాతం అందుకొని 66.47 డాలర్లకు చేరుకున్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతిచర్చలు కూడా ధరలు పెరుగడానికి ప్రధాన కారణమన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

