న్యూఢిల్లీ: బంగారం ధర బుధవారం రూ.56,000లను దాటిం ది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.378 పెరిగి రూ.56, 130కి చేరింది. అయితే హైదరాబాద్లో రూ.170 పెరిగి రూ. 55,750 గానే ఉన్నది. 22 క్యారెట్ ధర నగరంలో రూ.51,100 పలుకుతున్నది. కాగా, దేశ, విదేశీ మార్కెట్లలో ర్యాలీ నడుస్తున్నదని ట్రేడింగ్ విశ్లేషకులు చెప్తున్నారు. మంగళవారం రూ.55,752 వద్ద ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం ఢిల్లీలో రూ.56,000 స్థాయిని అధిగమించింది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా పడిపోయాయి. కిలో రూ. 147 దిగి రూ.70,675కు పరిమితమైంది. హైదరాబాద్లో రూ. 75,500 లుగా ఉన్నది.