Gold -Silver Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తిరిగి పెరుగుతున్నాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.500 వృద్ధితో రూ.72,850లకు చేరుకున్నది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ మార్కెట్లోనూ బంగారానికి డిమాండ్ పెరిగింది. సోమవారం 10 గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.72,350 వద్ద స్థిర పడింది. 99.5 స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.500 పెరిగి రూ.72,500 వద్ద నిలిచింది. రిటైలర్లు, జ్యువెల్లర్ల నుంచి డిమాండ్ పెరగడం వల్లే బంగారం ధర పెరుగుదలకు కారణం అని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు కిలో వెండి ధర మంగళవారం ఫ్లాట్ గా కొనసాగింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1.30 డాలర్లు పెరిగి 2,502.70 డాలర్లకు చేరుకున్నది. పెట్టుబడులకు స్వర్గధామంగా నిలుస్తున్నందు వల్లే బంగారం ధర పెరుగుతున్నదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడం దీనికి కారణం అని పేర్కొన్నారు. మరోవైపు యూఎస్ ట్రెజరీ బాండ్లు బలహీన పడటంతోపాటు వచ్చేనెల 18న జరిగే యూఎస్ ఫెడ్ రిజర్వ్ సమావేశంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర దిగి వచ్చి 27.81 డాలర్లకు పరిమితమైంది.
Maruti Suzuki Ertiga | ఎంపీవీ కార్లకు గిరాకీ.. మారుతి సుజుకి ఎర్టిగా యమ పాపులర్..!
BSA Gold Star 650 | 15న భారత్ మార్కెట్లో బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ లాంచింగ్.. ఇవీ డీటెయిల్స్..!
Realme C63 5G | 32-ఎంపీ ఏఐ ఫీచర్లతో రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్.. ఇవీ డీటెయిల్స్..!