Gold Rates | ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెండిండ్ల సీజన్ కొనసాగుతున్నది. అయినా, బంగారం, వెండి ధరల్లో అనిశ్చితి కొనసాగుతున్నది. సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర (24 క్యారట్స్) రూ.200 పతనమై రూ.79,100లకు చేరుకున్నది. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.78,800 పలికింది. శుక్రవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.79,400 వద్ద స్థిర పడిన సంగతి తెలిసిందే. 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం పది గ్రాములు ధర రూ.79 వేల వద్ద ముగిసింది. ఇక సోమవారం కిలో వెండి ధర రూ.2,200 తగ్గి రూ.90 వేల వద్ద నిలిచింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.92,200 వద్ద స్థిర పడింది.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ తులం ధర రూ.478 పతనమై రూ.75,896లకు చేరుకున్నది. మరోవైపు కిలో వెండి డిసెంబర్ డెలివరీ ధర రూ.574 పడిపోయి 88,307లకు చేరుకున్నది. అంతర్గత ట్రేడింగ్ లో కిలో వెండి ధర రూ.1,081 పడిపోయి రూ.87,800లకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 23.50 డాలర్లు పతనమై 2,657.50 డాలర్లకు చేరుకున్నది. కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఇంట్రాడే ట్రేడింగ్ లో పుత్తడి ఔన్స్ ధర 2621 డాలర్ల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు ఔన్స్ వెండి ధర 1.36 శాతం తగ్గి, 30.69 డాలర్లు పలికింది.