సిటీబ్యూరో, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఇప్పుడే పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడానికి అత్యుత్తమ సమయమని, జీఆర్టీ జ్యువెలర్స్ ‘గోల్డ్ ఎక్సేంజ్ ’ మేళాను ప్రకటించిందని, ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ ఆనంద్ అనంత పద్మనాభన్ అన్నారు. ఈ ప్రత్యేక అవకాశంలో కస్టమర్లకు తమ పాత బంగారాన్ని మార్పిడి చేసుకునే విలువతోపాటు గ్రాముకు రూ. 150 అదనంగా పొందవచ్చని మేళా ప్రారంభోత్సవం సందర్భంగా ఎండీ తెలిపారు.
ఈ పరిమిత కాల ఆఫర్, పాత ఆభరణాలను కొత్తగా మలచుకోవాలనుకునే వారికి, ముఖ్యంగా వివాహాలు, వేడుకల సీజన్లో జీఆర్టీ నుంచి నూతన అద్భుతమైన ఆభరణాలను పొందడానికి సరైన అవకాశమని, దానిని ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ గోల్డ్ ఎక్సేంజ్ మేళా ద్వారా కస్టమర్లు అదనపు విలువను పొందుతూ తమ వేడుకలను మరింత ప్రత్యేకంగా మార్చుకోవచ్చని ఆయన అన్నారు. మరో మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ రాధకృష్ణన్ మాట్లాడుతూ జీఆర్టీ గోల్డెన్ ఎల్వెన్ ప్లెక్సీ ఫ్లాన్‌ను కూడా అందిస్తుందని చెపారు.
ఇది నెలవారీ ఆభరణాల కొనుగోలు ప్రణాళిక, 18శాతం వరకు వేస్జేజి ఛార్జీలు లేకుండా, బరువు లేదా విలువ ఆధారంగా అనువైన ఎంపికలతో, వినియోగదారులు బంగారం ధరల హెచ్చుతగ్గుల ప్రభావం లేకుండా స్వేచ్ఛగా పెట్టుబడి పెట్టే సౌలభ్యాన్ని ఈ ప్రణాళిక అందిస్తుందన్నారు. 1964లో స్థాపించిన జీఆర్టీ జ్యువెలర్స్ భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఆభరణాల బ్రాండ్లలో ఒకటిగా ఎదిగిందన్నారు.