న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో గోల్డ్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్(ఈటీఎఫ్)ల్లోకి రూ.31,561 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. కిందటేడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన పెట్టుబడులతో పోలిస్తే ఆరింతలు పెరిగాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(ఆంఫీ) తాజాగా వెల్లడించింది.
మరోవైపు, అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో వచ్చిన రూ.23,132 కోట్లతో పోలిస్తే 36 శాతం ఎగబాకయని పేర్కొంది. మార్చి నెలలోనే రూ.2,266 కోట్ల పెట్టుబడులు ఆకర్శించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు..ఫిబ్రవరి నెలలో రూ. 5,255 కోట్లు, జనవరి నెలలో రూ.24, 040 కోట్లు పెట్టుబడులు వచ్చాయి.