Gold Demand | ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బంగారం డిమాండ్ మూడుశాతం పెరిగి 1,249 టన్నులకు చేరుకుంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా డిమాండ్ పెరగడం విశేషం. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం.. వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో బంగారం డిమాండ్‌ను నిలుపుకోవడంతో పెట్టుబడుల ప్రవాహనం కొనసాగడంతో త్రైమాసికంలో బంగారానికి డిమాండ్ పెరుగుతోంది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశ బంగారం డిమాండ్ 10 శాతం తగ్గి 134.9 టన్నులకు చేరుకుందని ప్రపంచ బంగారు మండలి (WGC) గురువారం తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఇది 149.7 టన్నులుగా ఉన్నది. విలువ పరంగా ఈ క్యాలెండర్ సంవత్సరం రెండవ త్రైమాసికంలో బంగారం డిమాండ్ 30 శాతం పెరిగి రూ.1,21,800 కోట్లకు చేరుకుంది. ఇది 2024 ఇదే కాలంలో రూ.93,850 కోట్లుగా నమోదైంది. మరో వైపు బంగారం ధరలు మొదటిసారిగా తులానికి గ్రాములకు రూ.లక్ష మార్క్‌ను అధిగమించింది.
వాణిజ్య ఉద్రిక్తతలు, వివిధ దేశాల మధ్య యుద్ధ భయాలు తదితర కారణాలతో ఈ ఏడాది ప్రారంభంలో మార్కెట్లు అస్థిరతను ఎదుర్కొన్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు లూయిస్ స్ట్రీట్ పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో బంగారం డాలర్ పరంగా 26శాతం లాభాలను నమోదు చేసింది. బంగారం డిమాండ్‌ను పెంచడంలో గోల్డ్ ఈటీఎఫ్‌లు కీలకంగా పని చేశాయి. రెండో త్రైమాసికంలో 170 టన్నుల మేర పెట్టుబడులు వచ్చాయి. 2024 రెండవ త్రైమాసికంలో స్వల్ప అమ్మకాలు నమోదయ్యాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు 2020 నుంచి తొలి అర్ధభాగంలోనే ఎక్కువగా పెట్టుబడులు చూశాయి. తొలి త్రైమాసికంలో రికార్డు స్థాయిలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగగా.. వరల్డ్ గోల్డ్ ఈటీఎఫ్ డిమాండ్ 397 టన్నులకు చేరుకుంది. మొత్తం బార్ అండ్ కాయిన్ పెట్టుబడులు సంవత్సరానికి 11 శాతం పెరిగి 307 టన్నులకు చేరుకున్నాయని WGC నివేదిక పేర్కొంది. చైనా పెట్టుబడిదారులు 115 టన్నులతో అగ్రస్థానంలో ఉన్నది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 44 శాతం గణనీయమైన పెరుగుదల నమోదైంది. భారతీయ పెట్టుబడిదారులు కొనసాగించారు. మరో వైపు ఆభరణాల డిమాండ్ తగ్గుతూ వస్తున్నది. వినియోగ పరిమాణం 14 శాతం తగ్గి 2020 కొవిడ్ సమయంలో అత్యల్ప స్థాయికి చేరుకున్నది.