Gold Returns | ద్రవ్యోల్బణంతోపాటు అమెరికాలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. వచ్చే జూన్లో వడ్డీరేట్లు తగ్గిస్తామని యూఎస్ ఫెడ్ రిజర్వు ప్రకటించడంతో డాలర్ బలహీన పడటంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర (24 క్యారట్లు) రూ.72 వేలు దాటేసింది. గత ఆరు నెలల్లో బంగారంపై పెట్టుబడులకు 25 శాతం రిటర్న్స్ వచ్చాయి.
పదిగ్రాముల బంగారం ధర ఆరు నెలల్లో రూ.57 వేల నుంచి రూ.72,160 మార్కును దాటేసింది. గత మూడు నెలల్లోనే 10 శాతానికి పైగా రిటర్న్స్ లభించాయి. ఇదే ధోరణి ఇక ముందు కూడా కొనసాగనున్నది. ఆరు నెలల క్రితం చెన్నైలో 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.63,960 పలికితే, ఇప్పుడు రూ.72,160 వద్దకు చేరుకున్నది.
2023లో తులం బంగారం ధర రూ.8,000లకు పైగా పెరిగింది. గతేడాది జనవరి ఒకటో తేదీన తులం బంగారం ధర రూ.54,867 పలికితే, 2023 డిసెంబర్ 31న రూ.63,246 పలికింది. దీని ప్రకారం గతేడాది బంగారం ధర రూ.8,379 (16 శాతం) పుంజుకున్నది. మరోవైపు చెన్నైలో అక్టోబర్ ఏడో తేదీన కిలో వెండి ధర రూ.75 వేలు పలికితే, ఈ నెల ఏడో తేదీన రూ.87 వేలకు పెరిగింది.