హైదరాబాద్, జూలై 12: బంగారం ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పుంజుకుంటున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ పదిగ్రాముల ధర రూ.710 అధికమై రూ.99 వేల నుంచి రూ.99,710కి చేరుకున్నది.
అలాగే 22 క్యారెట్ కలిగిన గోల్డ్ ధర రూ.650 అధికమై రూ.91,400 పలికింది. అంతకుముందు ఇది రూ.90,750గా ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉండటంతో కిలో వెండి రూ.4 వేలు అధికమై రూ.1.25 లక్షలకు చేరుకున్నది.