హైదరాబాద్, సెప్టెంబర్ 20: గోద్రేజ్ ఇంటిరియో..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 104 నూతన స్టోర్లను తెరవబోతున్నట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దేవ్ నారాయణ్ సర్కార్ తెలిపారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లలో 10 ప్రత్యేకంగా గృహోపకరణాల విక్రయ అవుట్లెట్లను తెరుస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొన్ని అన్ని రకాల ఉత్పత్తులపై 35 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.
ఎల్ఐసీ ఫండ్ కొత్త స్కీం
ముంబై, సెప్టెంబర్ 20: ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ తాజాగా నూతన ఫండ్ స్కీంను ప్రారంభించింది. కంపెనీల కోసం ప్రారంభించిన ఈ ఫండ్ స్కీం వచ్చే నెల 4 వరకు తెరిచివుంటుందని, అదే నెల 11న కేటాయింపులు జరపనున్నట్లు పేర్కొంది.