హైదరాబాద్, అక్టోబర్ 18: గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూపునకు చెందిన ఆర్థిక సేవల సంస్థ గోద్రేజ్ క్యాపిటల్..తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో రూ.500 కోట్లకు పైగా రుణాలు మంజూరు చేసిన సంస్థ..వచ్చే మార్చి నాటికి రూ.800 కోట్లకు పెంచుకోవాలనుకుంటున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో మనీష్ షా తెలిపారు.
ప్రస్తుతం సంస్థ ఎంఎస్ఎంఈ, ఎస్ఎంఈలకు రుణాలు ఇస్తుండగా, వచ్చే రెండు నుంచి మూడేండ్ల కాలంలో తెలుగు రాష్ర్టాల్లో గృహ రుణాలు కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. డెయిరీ ఫామ్‌లకు కూడా రుణాలను మంజూరును ఇటీవల ప్రారంభించినట్లు, ఇందుకోసం క్రీమ్‌లైన్ డెయిరీ ఉత్పత్తుల సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు చెప్పారు.