హైదరాబాద్, మార్చి 11: హైదరాబాద్ కేంద్రంగా పాల ఉత్పత్తుల విక్రయ సంస్థ క్రీమ్లైన్ డెయిరీని హస్తగతం చేసుకున్నది గోద్రెజ్ ఆగ్రోవెట్. ఇప్పటికే 51.94 శాతం వాటాను కొనుగోలు చేసిన గోద్రెజ్ ఆగ్రోవెట్ తాజాగా రూ.930 కోట్లతో మరో 48 శాతం వాటా కొనుగోలు చేసింది.
ఈ వాటా కొనుగోలుకు కంపెనీ బోర్డు సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సంస్థ వెల్లడించింది. ఈ ఒప్పందం సెప్టెంబర్ 30 నాటికి పూర్తికాగలదనే విశ్వసాన్ని వ్యక్తంచేసింది.