హైదరాబాద్, సెప్టెంబర్ 1: విమానయాన రంగంలో సేవలు అందిస్తున్న జీఎమ్మార్ గ్రూపు.. గ్రీస్‌లో కొత్త పెట్టుబడుల అవకాశాల కోసం అన్వేషిస్తున్నది. జీఈకే టెర్నా భాగస్వామ్యంతో జీఎమ్మార్ గ్రూపు ఇప్పటికే గ్రీస్‌లోని క్రీట్ వద్ద గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తున్నది.
జీఎమ్మార్ గ్రూపు ఎనర్జీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బిజినెస్ చైర్మన్ శ్రీనివాస్ బొమ్మిడాల మాట్లాడుతూ..విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడానికి గ్రీస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, ముఖ్యంగా కలమట విమానాశ్రయంలో పెట్టుబడుల అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే క్రీట్లోని హెరాక్లియన్ విమానాశ్రయ పనులు 25 శాతం పూర్తయ్యాయని, టెర్మినల్ బిల్డింగ్లు, రన్‌వే, ట్యాక్సీవే నిర్మాణం వంటివి కొనసాగుతున్నాయన్నారు.